Heavy Rains In Telangana: తెలంగాణకు మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ !

-

Heavy Rains In Telangana Yellow Alert Issued: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్‌. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. వారం రోజుల నుంచి ఎలాంటి వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఉన్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 21, 22 తేదీలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rains In Telangana Yellow Alert Issued

అదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు సంభవించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version