తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం , విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, ఇలాంటి జిల్లాలలో అతి భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం, కామారెడ్డి అలాగే సిరిసిల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల, కరీంనగర్ సిద్దిపేట, మెదక్, వరంగల్, మహబూబ్నగర్, పెద్దపల్లి లాంటి జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.