శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రోజు రెండో శనివారం, రేపు ఆదివారం రెండు రోజులు సెలవు ఉండడంతో డ్యామ్ గేట్ల నుంచి దిగువకు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నది నీటి జలాలను చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో ఘాట్ రోడ్డులో నాలుగు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు మల్లన్న దర్శనానికి కూడా మూడు గంటలకు పైనే సమయం పడుతుంది. దీంతో భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడి దర్శనం కోసం ఓపికగా వేచి ఉంటున్నారు.
శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..
దోమలపెంట నుండి సున్నిపెంట వరకు నిలిచిపోయిన వాహనాలు
3 గంటలుగా రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు భారీగా తరలి వస్తున్న పర్యాటకులు
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భారీగా వాహనాల రద్దీ pic.twitter.com/033xngNb5O
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025