కరీంనగర్ లో కోడిపుంజు వేలం ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజుల క్రితం ఒక ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడికి వెళ్లే ఆర్టీసీ బస్సు లో కోడి పుంజుని మర్చిపోయాడు. కరీంనగర్ బస్టాండ్ కి రాగానే బస్సు డ్రైవర్ దాన్ని గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజుని కంట్రోల్ కి అప్పగించాడు. అప్పటి నుండి ఆ పందెం కోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అధికారులు తాడు తో కట్టి ఉంచారు ఆ కోడి సుమారు 6 కేజీలు ఉంటుందని ఆర్టీసీ డిపో అధికారులు చెప్పారు.
కోడిపుంజు కోసం దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా డిపో లో జాలి లో పుంజుని బంధించారు, ఇక ఎవరూ రాకపోవడంతో రేపు మధ్యాహ్నం మూడు గంటలకే కోడిపుంజు బహిరంగ వేలం వేయబోతున్నట్లు అధికారులు చెప్పారు అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ టు డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వేలం లో పాల్గొన్నగలరని చెప్పారు. ఇప్పుడు కోడిపుంజు వేలానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.