వైసీపీ లోక్ సభ అభ్యర్థులు వీళ్ళే…. !

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో 22మంది ఎంపీలు గెలిచినా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రావడంతో వైసీపీ అవసరం బీజేపీకి రాలేదు. కానీ, రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకి నార్త్ లో సీట్లు తగ్గితే కచ్చితంగా వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.

ఇందుకోసం 25 ఎంపీ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన సొంత బృందంతో ఏపీ వ్యాప్తంగా సర్వేలు చేయించారు. ఈ సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలనే లోక్ సభ అభ్యర్థులుగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు జగన్.అభ్యర్థుల మార్పులు, చేర్పులపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ జాగ్రత్త వహిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కీలకం కావాలంటే ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు.సీఎం జగన్ చేస్తున్న కసరత్తులో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.2019లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు.

ప్రస్తుతం ఆయనతో పాటు నరసన్నపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్,ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో తమ్మినేని సీతరామ్ కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.ఇంతవరకు వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలవకపోగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని సీఎం పథకం రచిస్తున్నారు. ఇక విజయనగరం ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ను పక్కన పెడుతున్నట్లు తెలిసింది.ఇక్కడ బొత్స బావమరిది శ్రీను పెరు ప్రధానంగా వినిపిస్తోంది. 2014లో మినహాయిస్తే అంతకుముందు ఆ తరువాత బొత్స సత్యనారాయణ హవా నడుస్తోంది.

విశాఖపట్నం ఎంపీ ఎంపీవీ సత్యనారాయణను పక్కన పెట్టిన సీఎం….. బొత్స ఝాన్సీలక్ష్మిని దాదాపుగా ఖరారు చేశారు. విశాఖపట్నంలో టీడీపీకె కాస్త జనాదరణ ఎక్కువ అని చెప్పుకోవాలి.కానీ ఇక్కడ 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది.2014లో బీజేపీ, 2019లో వైసీపీ గెలిచాయి. ఎక్కువగా చదువుకున్నవారు,ఉద్యోగులు ఓట్లు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు విజాగ్లో ట్రెండ్ మారుతుంటుంది.అరకు ఎంపీని కూడా మార్చేశారు సీఎం. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ని ఖరారు చేశారు.సిట్టింగ్ ఎంపీ మాధవి అరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.అనకాపల్లి ఎంపీగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరును పరిశీలిస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీ బీవీ సత్యవతికి ఈసారి టికెట్ నిరాకరించారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇంచార్జ్ గా నియమించారు.ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటం వలన చలమలశెట్టి సునీల్ పేరును పరిశీలిస్తున్నారు.అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ కు కూడా టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎలీజా పేరును సీఎం పరిశీలిస్తున్నారు.ఇక రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ను కూడా తప్పించారు.శెట్టిబలిజ సామాజికవర్గంకు చెందిన డాక్టర్ అనుసూరి పద్మలతను ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది.నరసాపురం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణంరాజు టీడీపీకి మద్దతు ఇస్తున్నారు.

ఈ స్థానంలో గోకరాజు గంగరాజు, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, కృష్ణంరాజు భార్య శ్యామలదేవి పేర్లు వినిపిస్తున్నాయి.ఏలూరుకి ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉన్నారు.ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ అదుష్టానం ఉంది.మాజీ మంత్రి ఆళ్ల నాని, మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే కొట్టు సత్యనారాయణ మళ్లీ ఎమ్మెల్టేగానే పోటీ చేస్తానని అంటున్నారు. వీళ్ళిద్దరితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త అరసవిల్లి అరవింద్, ప్రముఖ సినీ దర్శకులు వివి వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరిని తప్పించి సినీ డైరెక్టర్ వివి వినాయక్ ని పోటీకి పెట్టె అవకాశాలు ఉన్నాయి.

విజయవాడలో 2019లో ఓడిన పీవీపీ ని పక్కనపెట్టేశారు. ఆశక్తికర విషయం ఏమిటంటే అక్కినేని నాగార్జున ఎంపీగా నిలబడే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కూడా నాగార్జున పేరు వినిపించినా చివరిక్షణంలో మార్చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా రేసులో ఉంది.గుంటూరుకి పరిశీలనలో లావు శ్రీకృష్ణదేవరాయులు పేరు ఉంది. ప్రస్తుతం ఈయన నరసరావు పేట ఎంపీగా ఉన్నారు.నరసారావుపేటకి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బాపట్ల సిట్టింగ్ ఎంపీ నందిగం సురేశ్ ను కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ నిరాకరించారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి కి టికెట్ దక్కే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను కూడా పరిశీలిస్తున్నారు.నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోచా బ్రహ్మానందరెడ్డి స్థానంలో సినీనటుడు అలీ పేరును పరిశీలిస్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే కారణం.ఇక మంత్రి గుమ్మనూరి జయరాం ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసారు.

అనంతపురం ఎంపీ టెకెట్ ను మాజీ మంత్రి శంకరనారాయణకు కేటాయించారు.సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్యకు నిరాకరించారు.హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరాశే ఎదురైంది. జె.శాంతమ్మను ఇక్కడ పోటీ చేయించనున్నారు.ఇక కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఈసారి కూడా కొనసాగుతారు.నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.ఈ టికెట్ ని వైసీపీ అధిష్టానం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఖరారు చేసింది.

ఈ క్రమంలో ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టేసారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది.అటు రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్‌రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వనున్నారు.చిత్తూరు సిట్టింగ్ ఎంపీ ఎస్.రెడ్డప్పను మళ్లీ కొనసాగిస్తారు.మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే టికెట్ ఖరారు అయింది.

ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి అయినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఒకటి రెండు మార్పులు మినహాయిస్తే పైన పేర్కొన్న అభ్యర్థులకె ఎంపీ టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితా కోసం వైసీపీలోని ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ఎంపీల జాబితాను ప్రకటించేందుకు సీఎం జగన్ ముహూర్తం చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news