కరోనా చికిత్సకు డబ్బులెలా అని భయపడుతున్నారా? పాలసీ ఉంది చింతించకండి!

-

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొర జీవితాలతో ఇల్లు గడవటమే కష్టతరంగా మారింది. అటువంటిది ఒకవేళ మహమ్మారి వస్తే దాని ఖర్చుని ఎలా భరించాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఈ పాలసీలతో మీ భయం దూరం చేసుకోండి. మనలో చాలా వరకు ఇప్పుడిప్పుడే ఇన్సూరెన్స్‌ పాలసీకి అలవాటు పడుతున్నాం. అంటే ఇదివరకు కూడా కోవిడ్‌ చికిత్స భర్తి చేసే సంస్థలు కూడా లేవు. ఈ సందర్భంగా చాలా బీమా కంపెనీలు కరోనా హెల్త్‌ స్కీం లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వివిధ కంపెనీలు కరోనా చికిత్స కోసం అయ్యే వైద్య ఖర్చులకు ఇవి బీమా వర్తింపజేస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తానికి లేదా వ్యక్తిగతంగా కూడా ఈ బీమాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ పాలసీల వ్యవధి మూడున్నర నుంచి 9 నెలల కాల వ్యవధి పాలసీని కొనవచ్చు. కరోనా కవచ్‌ పాలసీలను కొనేందుకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించింది.

ఏ వైధ ఖర్చులకు పాలసీ కవరేజీ వర్తిస్తుంది?

ప్రభుత్వ టెస్టింగ్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయించుకొని, కోవిడ్‌ –19 నిర్ధారణ అయిన వ్యక్తులకే పాలసీ వర్తిస్తుంది. చికిత్సలో కోసం ఆస్పత్రిలో చేరిన వారి మెడికల్‌ ఖర్చులను పాలసీ భరిస్తుంది. కోవిడ్‌ చికిత్సకు అయ్యే అన్ని రకాల ఖర్చులు, ఇంటి వద్ద తీసుకునే చికిత్స ఖర్చులు, ఆసుపత్రికి వెళ్లడానికి ముందు నుంచి డిశ్చార్జ్‌ అయిన తరువాత అయ్యే వైద్య ఖర్చులకు పాలసీ కవరేజీ ఉంటుంది. కానీ ఆప్షనల్‌ పాలసీ తీసుకునే వారికి నియమ నిబంధనలు మారుతాయి.

ఏ వయస్సు వారికి వర్తిస్తుంది?

ఈ పాలసీలు కొనేవారు 18– 65 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. పాలసీ నియమ నిబంధనల ప్రకారం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 65 ఏళ్లు పైబడిన వారికి కూడా కవరేజీ కల్పిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్రాతిపదికన కూడా పాలసీ అందుబాటులో ఉంది.

ఆరోగ్య కార్యకర్తలకు ప్రీమియం తగ్గింపు

వైద్య సిబ్బంది, ఆరోగ్య నిపుణులు అందరికీ ప్రీమియంలో 5 శాతం ఈ తగ్గింపు ఉంటుంది.

బీమా మొత్తం ఎంత?

కరోనా కవచ్‌లో బీమా మొత్తం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. పాలసీ ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించే అవకాశం కూడా ఉంది.

వెయిటింగ్‌ పీరియడ్‌ ఎంత?

పాలసీ కొనుగోలు చేసిన 15 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే పాలసీ కొనుగోలు చేసిన 15 రోజులకు కవరేజీ అమల్లోకి వస్తుంది. కానీ రెన్యువల్‌ చేసే సమయంలో వర్తించదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version