రైతుబంధుకు అర్హులుగా ఉండే రైతు రైతుబీమాకు కూడా అర్హులుగా ఉంటారు. అయితే రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆగస్టు 11 చివరి తేదీగా ప్రకటించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా రైతుబీమా ప్రతీ సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులెవరైనా చనిపోతే నామినీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయడమే ప్రధాన లక్ష్యం.
అయితే, ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు.. 11వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని వ్యవసాయ శాఖ చెప్పింది. దరఖాస్తుదారుడి వయస్సు 18 – 59 ఏళ్ల మధ్య ఉండాలని సూచించింది. ఆధార్ కార్డ్ ప్రకారమే వయస్సును పరిగణిస్తారు. సాధారణంగా రైతుకు ఒక్క దగ్గర మాత్రమే భూమి ఉండదు.. కొంత మందికి వేర్వేరు ప్రదేశాల్లో ఉంటుంది.
కానీ, ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది. రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అఉౖ కు అందజేయాలి. ఇప్పడు దరఖాస్తు చేసుకోకపోతే మరో ఏడాదిపాటు అవకాశం ఉండదు. అందుకే ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.