“సర్కారు వారి పాట” మోషన్‌ పోస్టర్‌‌.. హ్యపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌

-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్ర మోషన్‌ పోస్టర్‌‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తోనే ఆకట్టుకున్న సర్కారు వారి పాట ఇప్పుడు మోషన్‌ పోస్టర్‌తో అంచనాలను అమాంతం పెంచేసింది. సూపర్‌ స్టార్‌ హ్యాపీబర్త్‌డే అంటూ, పరుశురామ్‌కి థ్యాంక్స్‌ చెబుతూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహేష్‌ బాబు నటిస్తున్న 27వ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, మత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అద్బుతమైన స్పందన వచ్చింది.

గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్నందిస్తున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు థమన్ ల కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీటవుతోంది. ఇక సూపర్‌ స్టార్‌ పక్కన నటించబోయే హీరోయిన్‌ ఎవరో ఇప్పటివరకు ఫైనల్‌ చెయ్యలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కీర్తి సురేష్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజును ఓరేంజ్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్‌. ‌ బర్త్ డే ట్వీట్స్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే #HBDSuperstarMahesh హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news