బ్రేకింగ్ : హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్టు

-

మంచిరేవుల లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య గెస్ట్ హౌస్ లో పేరాట కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏ-1 గా గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు చేర్చి అరెస్టు కాగా… ఈ కేసులో మరో బిగ్‌ ట్విస్ఠ్ చోటు చేసుకుంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్టు అయ్యాడు.

మంచిరేవుల ఫాంహౌస్ పేకాట కేసు లో శివలింగ ప్రసాద్ ను అరెస్టు చేశారు నార్సింగ్‌ పోలీసులు. శివలింగ ప్రసాద్ ను అరెస్టు చేసిన పోలీసులు… ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చారు. గతంలో రెండు సార్లు శివలింగ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసిన నార్సింగి పోలీసులు… ఇవాళ అరెస్ట్‌ చేశారు. కాగా… ఈ కేసు లో గుత్తా సుమ‌న్ కుమార్ కు ఉప్పరపల్లి కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న గుత్తా సుమన్ కుమార్ ను ఇప్పటి వ‌ర‌కు కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్ లో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news