![hero nagashourya fled away to farm house with family](https://cdn.manalokam.com/wp-content/uploads/2020/06/pjimage-2.jpg)
కరోనా విజృంభణకు అడ్డుకట్ట లేకుండా పోయింది.. ఈ వ్యాది ఎక్కడనుండి వస్తుంది ఎలా వస్తుందో ఎవ్వరూ పసిగట్టలేకపోతున్నారు. తాజాగా సినీ నటుడు నిర్మాత బండ్ల గణేశ్ కు కరోన పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే ఇక ఆయనకు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలియగానే సినీ ప్రముకులంతా ఒక్కసారిగా ఉలుక్కిపడ్డారు. బండ్ల గణేశ్ ఉంటున్న ఇంటి పొరుగు ప్రాంతంలోనే హీరో నాగ శౌర్య ఉంటాడు. ఇక బండ్ల గణేశ్ కు పాజిటివ్ రావడంతో నాగ శౌర్య తన కుటుంబాన్ని ఆ ప్రాంతంలో ఉంచడం సేఫ్ కాదని భావించి ఫామ్ హౌజ్ కి వెళ్ళినట్టు సమాచారం. ఈ కరోన మహమ్మారి జనాలనే కాకుండా పరిశ్రమలని రంగాలని అన్నిటిని కదలించి వేసింది. ఒక్కసారిగా సినిమాలు షూటింగులు అన్నీ ఆగిపోయాయి. ఇక నాగశౌర్య ప్రస్తుతం ఆయన సౌజన్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు.. కానీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. కరోన విజృంభణ చల్లారిన తరువాత తిరిగి షూటింగులు ప్రారంభమయ్యేవరకు హైదరబాద్ లోని తన ఫామ్ హౌజ్ లోకి వెళ్లిపోవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.