Tollywood: ఫాదర్స్ డే సెలబ్రిటీ స్పెషల్..!

-

జీవితంలో ప్రతీ ఒక్కరికి ..అది కొడుకైనా కూతురైనా …తండ్రే హీరో. అన్ని నేర్పించేది…సరైన మార్గంలో నడిపించేది కన్న తండ్రి మాత్రమే. తల్లి తండ్రుల కి తమ బిడ్డల మీద ఉండేది వెలకట్టలేని ప్రేమ. ఈ ప్రేమని డబ్బుతో కొనలేము..మాటల్లో చెప్పలేము. అదొక అందమైన అనుభూతి… తీపి జ్ఞాపకం. ఆ అనుభూతి.. ప్రేమ తల్లి తండ్రులకి తమ పిల్లలకి మద్యనే ఉంటుంది. అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా తండ్రే మొదటి గురువు..మొదటి స్నేహితుడు. అలాంటి తండ్రి గురించి పట్టించుకునే సమయం ఒక వయసు వచ్చాక దాదాపు చాలా మంది కొడుకు కూతూళ్ళకి దొరకడం లేదు.

మానవీయ సంబంధాలు అంటే ఇవేనేమో. అయితే ప్రతీ ఒక్కరికి అమ్మ అయ్యాక అమ్మతనం తెలిసొస్తుంది. తండ్రి అయ్యాక తండ్రి ఎంత గొప్పవారో తన పిల్ల కోసం ఎన్నో వదులుకొని ఉంటారో.. ఎన్ని త్యాగాలు చేసి ఉంటారో తెలిసొస్తుంది. ప్రపంచంలో తారతమ్యం లేనిది ఇంకెవరి దగ్గర దొరకనిది అంటే అది తల్లి తండ్రుల ప్రేమ ఒక్కటే. సామాన్యుడి నుంచి సినీ రాజకీయ ..పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు తండ్రి అంటే హీరో అంతే.

 

 

తన పిల్లకోసం నిరంతరం తాపత్రయపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల ముందు మాత్రం చిరు నవ్వుతో కనిపిస్తారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక ఎమోషనల్ జర్నీ ఏదైనా ఉంటుందంటే అది తండ్రీ పిల్ల మద్య సాగే అందమైన జీవిత ప్రయాణమే. కాని ఈ ప్రయాణాన్ని ఎంతో మంది మిస్ అవుతున్నారు.

ఇక ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యుల దగ్గరి నుంచి సినిమా సెలబ్రిటీస్ వరకు తన తండ్రి తో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఎంత మధురమైన క్షణాలో కదా ఇవి.

Read more RELATED
Recommended to you

Latest news