ప్రభాస్ సరికొత్త రికార్డ్..!

-

బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. మామూలు స్టార్ గా ఉన్న ప్రభాస్ బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచీ ఆయన నటించే సినిమాల బడ్జెట్టూ పెరిగింది, బిజినెస్సూ పెరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా అతనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఫాలోవర్స్  విపరీతంగా పెరిగిపోయారు. తాజాగా ఫేస్ బుక్ లో ఆయనకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దీంతో దక్షిణాది సినిమా తారల్లో ప్రభాస్ ది ఒక రికార్డుగా చెబుతున్నారు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలలా ప్రభాస్ కి అభిమానులున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news