అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు కొత్త చిత్రం..

-

సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ఐతే అంతకుముందే తన కెరీర్లో మరో కొత్త మలుపు తీసుకోబోతున్నాడు. మొదటి సారిగా అనిల్ రావిపూడి సమర్పణలో సినిమా తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు హీరోగా గాలి సంపత్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ సపోర్ట్ గా ఉంటున్నాడు.

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన చిత్రబృందం, ఈ సినిమా కథ తండ్రీ కొడుకుల మధ్య సాగుతుందని, సినిమా మొత్తం నవ్విస్తూ ఎమోషనల్ గా సాగుతుందని తెలిపారు. అచ్చు రాజమణీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సన్ షైన్ స్క్రీన్, ఇమేజెస్ పార్క్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version