నేను గెలిచి ప్రకాష్ రాజ్ ఓడటం బాధగా ఉంది : శ్రీకాంత్

మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయి మంచు విష్ణు గెలవడం పై హీరో శ్రీకాంత్ స్పందించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాబు మోహన్ పై శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…. తనను నమ్మారు కాబట్టి ఓటు వేసి గెలిపించారని తెలిపారు. తాను గెలిచి అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉందని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

మా కోసం తాము పని చేయాలని ఎన్నో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గత రెండు నెలలుగా ప్రకాష్ రాజ్ తో కలిసి ప్రయాణించామని శ్రీకాంత్ తెలిపారు. తమ బృందం మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోకపోవడం నిరాశ కలిగించే విషయమని అన్నారు. అయితే ఇది కూడా ఒక సినిమా అనుకోని వెళ్లి పోవడమే అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణుకు శ్రీకాంత్ అభినందనలు తెలిపారు.