హీరోయిన్ పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. వరుడు ఎవరంటే..?

-

బాలీవుడ్ హీరోయిన్ పరిమితి చోప్రా డేటింగ్ రూమర్స్ తో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. కానీ ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ బాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ డేటును కూడా ఫిక్స్ చేశారు అంటూ సమాచారం. ఈ నేపథ్యంలోనే వరుడు ఎవరు అని ఆరా తీయగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నారట.

ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీరిద్దరి నిశ్చితార్థం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్స్ వాయిదా వేసుకున్న పరిణీతి పెళ్లి పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారట. ఈనెల 10వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ వేడుక చాలా ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఎక్కడ బయటపెట్టని ఈ జంట ఇటీవల ముంబై లోనే ఒక రెస్టారెంట్ కి డిన్నర్ డేట్ కి వెళ్లి మీడియా కంటపడ్డారు.

ఇక ఆ తర్వాత ఒక ఈవెంట్ కి కూడా జంటగా కలిసి వచ్చారు. దాంతో రాఘవ్, పరిణీతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇక అందుకే ఎంగేజ్మెంట్ అనంతరం తమ రిలేషన్ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మొన్నటి వరకు రూమర్స్ తో తలమునకులైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే నిర్వహించి పెళ్లి ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news