హీరోయిన్ నగ్మాకి కరోనా పాజిటివ్..!

-

కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా సరే అది తీసుకోని వారే కాదు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించారు ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా. కొద్దిపాటి సిమ్టమ్స్ రావడంతో కరోనా టెస్ట్ చేయించుకున్న నగ్మా కరోనా పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్ 2న నగ్మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారట. వ్యాక్సిన్ తీసుకున్నా సరే తనకు కరోనా వచ్చిందని నగ్మా ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశారు.

అయితే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా వచ్చినా దాని ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందట. ఆల్రెడీ టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే ఆయన వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదని చెప్పారు. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని ఆయన స్వీయ అనుభవంతో చెప్పారు. ఓ పక్క సోనూ సూద్ కూడా నిన్న అమృత్ సర్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమే కాకుండా సంజీవని వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news