కొత్త అవతారంలో రాధిక ఆప్టే

-

బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే గురించి ఆమె గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా ద్వారా కూడా తనదైన శైలిలో గ్లామర్ ఫోటోస్ తో మరింత రచ్చ చేస్తోంది.

అయితే, ఈ బాలీవుడ్ నటి రాధిక ఆప్టే త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు చెప్పింది. తమిళంలో ధోని మూవీలో నటిగా ఎంట్రీ ఇచ్చి, తెలుగుతో పాటు బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో శిక్షణ తీసుకున్నట్టు వివరించింది. నటిస్తున్న సమయంలోనే కొన్ని కథలను సిద్ధం చేసుకున్నట్లు చెప్పింది. అయితే ఏ భాషలో డైరెక్షన్ చేస్తుందో వెల్లడించలేదు. అయితే నటనకే తన తొలి ప్రాధాన్యత అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version