కరోనా కు చెక్ పెట్టేందుకు పోటీ పడుతున్నారు శాస్త్రవేత్తలు.. ఓరకంగా చెప్పాలంటే దేశంలో ఔషద పోటీలు నడుస్తున్నాయి. ముందు హైదరబాద్ కు చెందిన సంస్థ హెటీరో కరోనా కు మెడిసిన్ కనుగొంది అదే కోవిఫర్ 100 ఎంజీ.. ఈ మెడిసిన్ జెనరిక్ మేడిసిన్ గా ఇంజెక్షన్ రూపంలో ప్రజలకు లభ్యమవుతుంది. ఇక మరో వైపు సిప్లా సంస్థ కూడా పోటాపోటీన మరో మెడిసిన్ తో ముందుకొచ్చింది సిప్లా తయారు చేసిన మెడిసిన్ యొక్క ధర 5 వేల లోపే ఉంటుంది అని సంస్థ వెల్లడించింది. ఇక ఇప్పుడు తాజాగా హెతిరో సంస్థ కూడా కోవిఫర్ 100 ఎంజీ ధరను ప్రకటించింది. 100 ఎంజీ ఇంజెక్షన్ ధర ను 5400 గా సంస్థ నిర్ణయించింది అంటే సుమారు 71 డాలర్లు. దాదాపుగా 20 వేల వెయిల్స్ ను మార్కెట్ లోకి తక్షణమే విడుదల చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఇక 127 దేశాలకు డ్రగ్ ను ఎగుమతి చేయాలని సంస్థ నిశ్చయించుకుంది.
కరోనా డ్రగ్ ”కోవిఫర్ 100 ఎంజీ” ధర చెప్పేసిన హెటీరో..! ధర ఎంతంటే…..
-