ఇజ్రాయిల్ దాడిలో హేజ్బొల్లా చీఫ్ హతం..!

-

ఇటీవలే ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరూ హత మార్చిన విషయం తెలిసిందే. వారిలో టెహ్రాన్ లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే, లెబనాన్ నుంచి పని చేస్తున్న హెజ్బొల్లా కమాండర్ పువాద్ శుక్ర్ మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఎవ్వరినైనా, ఎక్కడైనా తమ శత్రువులు అని భావిస్తే.. చంపడం ఇజ్రాయిల్ కి వెన్నతో పెట్టిన విద్య అని నిపుణులు చెబుతున్నారు. 

తాజాగా మరో సంచలన ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీరూట్ పై జరిపిన రాకెట్ దాడులలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించించింది. శుక్రవారం రాత్రి నుంచి అతనితో కమ్యూనికేషన్ లేదని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు న్యూస్ ఏజెన్సీ AFP కి తెలపడంతో ఈ వార్తను కన్ఫర్మ్ చేసినట్టు అయింది. హసన్ నస్రల్లా చనిపోయాడని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి నడవ్ షోషాని ట్వీట్ చేశారు. లెబనాన్ లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ఐడీఎఫ్ భీకర దాడుల గురించి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news