స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదని బాంబ్ పేల్చారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని… Rinl విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదని తెలిపారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుందని తెలిపారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
ఉద్యోగుల భద్రత,సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని… ప్రత్యామ్నాయల గురించి ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని వివరించారు. ఉద్యోగులు, కార్మికులను తప్పు పట్టడం లేదని… ఉత్పత్తి ఎంత కార్మికులు ఎంత అన్న సమాచారం తీసుకున్నానని తెలిపారు. మిగతా సంస్థలతో పోలిస్తే విశాఖ స్టైల్ ప్లాంట్ లో కార్మికులు ఎక్కువ ఉన్నారు..ఉత్పత్తి తక్కువగా ఉందని వివరించారు. పనిలేనప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదని తెలిపారు. నష్టాలు భరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు… శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు.