ములుగు జిల్లాలో మళ్ళీ హై అలెర్ట్…!

-

మావోయిస్ట్ లు ఇప్పుడు తెలంగాణా పోలీసులను కాస్త కంగారు పెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ఇటీవల మావోయిస్ట్ లను టార్గెట్ చేస్తూ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మరోసారి ములుగు జిల్లాలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహాసాగర్ అటవీప్రాతంలో మొన్న జరిగిన జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టులు రవ్వ రామల్ అలియాస్ సుధీర్, లక్మాల్ మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

maoists
maoists

ఈ అంత్యక్రియల్లో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అయితే వరంగల్ అర్బన్ జిల్లాలో అలజడి మొదలయింది. వరంగల్ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. విరసం నేతలు ప్రెస్ మీట్ పెడతారనే సమాచారం తో ఎవరు వస్తున్నారంటూ అరా తీస్తున్న పోలీసులు… మఫ్టీలో కూడా నిఘా పెట్టారు. అనుమానం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news