అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. అత్యాచార బాధితురాలు ఎనిమిది నెలల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇచ్చింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ కేసు విచారణ పై వెనక్కి తగ్గమని దీనిమీద అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలు తండ్రిని కోర్టు ఆదేశించింది. గర్భాన్ని రద్దు చేయాలని మైనస్ సర్వైవర్ చేసిన పిటిషన్ ని అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.
నిందితుడు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారని దీంతో తన గర్భాన్ని తీయించుకోవడానికి అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు చెప్పింది ఈ పిటిషన్ జిఎస్ అహ్లువాలియా ధర్మాసనం విచారించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగర్ జిల్లాలో నిందితుడు 17 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆమె గర్భం దాల్చింది గత ఏడాది అక్టోబర్ 23న ఈ విషయంపై కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడి పై అత్యాచార చట్టాలు ఎస్సీ ఎస్టీ చట్టాలు కింద కేసులు నమోదు చేశారు