రమేష్‌ బాబు విచారణకు హైకోర్టు అనుమతి..!

-

విజయవాడలోని ప్రముఖ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో ఉన్న రమేష్ హాస్పటిల్స్ ఎండీ రమేష్ బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. కస్టడియల్ విచారణకు ఆదేశిస్తూ..కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రమేష్ బాబును అదుపులోకి తీసుకుని పోలీసులు నవంబర్ 30నుంచి డిసెంబర్ 2 వరకూ విచారించనున్నారు. అయితే రమేష్ బాబు విచారణంతా న్యాయవాదుల సమక్షంలోనే జరగాలని కోర్టు పేర్కొంది.

ap-high-court

ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో మంటలు చెలరేగి 10 మంది చనిపోగా 20మందికి గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటనపై ఏపీ సర్కార్ రమేష్ ఆసుపత్రిపై కేసు నమోదు చేసింది. అయితే గవర్నర్ పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరతూ ఎండీ రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామ్మేహన రావులు కోర్టుకు దాఖలు చేశారు.. దాంతో తదుపరి చర్యలన్నింటిని ధర్మాసనం నిలిపివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ…ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేయటంతో తాజాగా అనుమతి ఇస్తూ.. కోర్టు ఆదేశించింది.

పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రమేష్‌ ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టరు డా. రమేష్‌బాబు తరపున రమేష్‌ ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి తనను మళ్లీ హాజరుకావాలని సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని… ప్రస్తుతం ఉన్నటువంటి కొవిడ్‌-19 తీవ్ర పరిస్థితులలో, సుప్రీంకోర్టు.. కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయొద్దని పోలీసులు వారికి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను దృశ్య, శ్రవణ విధానంలో విచారించమని డా. రమేష్‌బాబు ఆ ప్రకటనలో కోరారు. కాగా తాజా ఉత్తర్వులతో రమేష్ బాబు పోలీసులతో డైరెక్ట్ గానే…విచారణకు హాజరుకావల్సి ఉంది. ఈ కేసులో మొదటినుంచి రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తప్పు మాది లేదు.. రోగుల చికిత్స వరకే తమ భాద్యత..హోటల్ సంరక్షణ స్వర ప్యాలెస్ హోటల్ దే అని చెప్పుకొస్తుంది.. మరి ఈ విచారణతో చివరికి ఏం జరుగుతోందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news