ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర స్పందించింది. ఇందుకు గాను బుధవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో జవనరి 1 నుంచి తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా హైకోర్టులు పని చేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్న యథ స్థానంలోనే కొనసాగనుంది. ఏపీ హైకోర్టుని మాత్రం అమరావతిలో నూతనంగా నిర్మించనున్న భవనంలో ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి హైకోర్టు విభజన ప్రక్రియ కొద్ది రోజుల ముందే ప్రారంభమైనప్పటికీ.. ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని భేటీ అయిన కాసేపటికే హైకోర్టు విభజన నోటిఫికేషన్ విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకంటూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు విభజన సంపూర్ణం కాదనే భావనను తెలంగాణ ప్రభుత్వం పదే పదే వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ న్యాయమూర్తులు వీరే…
జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుత ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ గుడిసేవ శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజనీ, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ శ్రీమతి కొంగర విజయలక్ష్మీ, జస్టిస్ గంగారావు.