బుల్ బుల్ బాలయ్య.. మళ్లీ టార్గెట్ చేసిన నాగబాబు..!

-

మెగా బ్రదర్ నాగబాబు చేసే పనుల వల్ల మెగా కాంపౌండ్ ఇబ్బందుల్లో పడుతుందా అంటే అవుననే చెప్పాలి. పవన్ ఎలాగు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాడు కాబట్టి ఆయన ఏదైనా అన్నా అది చెల్లుబాటు అవుతుంది. కాని అలా కాకుండా పవన్ కు సపోర్ట్ గా నాగబాబు పవన్ ను టార్గెట్ చేసిన వారి మీద విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. అందులో ముఖ్యంగా బాలకృష్ణ మీద నాగబాబు ఫైర్ మీద ఉన్నాడు.

ఈమధ్య ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పిన నాగ బాబు ఆ తర్వాత వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపించి బాలకృష్ణ ఓ పెద్ద కమెడియన్ అని అన్నాడు. అప్పుడే నందమూరి ఫ్యాన్స్ కోపానికి కారకుడయ్యాడు నాగబాబు. సరే పవన్ తెలియదని అన్నాడు కాబట్టి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పడం చెల్లుకు చెల్లు అని అనుకుని సైలెంట్ అయ్యారు.

ఇక మానిన పుండుని మళ్లీ గిల్లినట్టుగా ఎవరో కుర్రాడు సారే జహాసే అచ్చా అంటూ ఓ స్కూల్ పిల్లాడు స్పష్టంగా పాడిన ఓ వీడియోని షేర్ చేశాడు నాగబాబు. ఆ వీడియో ద్వారా ఆయన ఏం చెప్పదలచుకున్నాడో ఏమో కాని ఈమధ్య బాలకృష్ణ తెలంగాణ ఎలక్షన్స్ లో సారే జహాసే అచ్చాని పాడటం మధ్యలో బుల్ బుల్ అనడం అంతా తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోతో మళ్లీ బాలకృష్ణకు పంచ్ వేసేలా నాగబాబు చేసిన ఈ పని మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవ ఉద్రిక్తమయ్యేలా చేస్తుంది. రాజకీయాల పరంగా ఉన్న ఈ ఫైట్ సినిమా పరిశ్రమకు పాకింది మరి రాను రాను పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.

https://www.facebook.com/NagaBabuOfficial/videos/2012386839059744/

Read more RELATED
Recommended to you

Latest news