రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలి : హైకోర్ట్‌

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అదనపు భద్రతను కల్పించాలని తెలంగాణ హైకోర్టు సోమవాంనాడు ఆదేశించింది. భద్రత విషయమై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. ఇవాళ విచారణలో ఇరు వర్గాల వాదనలను హైకోర్టు విన్నది. రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రేవంత్ రెడ్డి భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్సీలను ఆదేశించినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు పంపిన ఫాక్స్ మేసేజ్ ను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రతను కేటాయిస్తున్నారా లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని ఈ నెల 3న ఆదేశించింది హైకోర్టు. ప్రస్తుతం కేటాయించిన భద్రత కేవలం ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతుందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.రేవంత్ రెడ్డి కోసం 69 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డికి అదనంగా భద్రతను కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version