విష్వక్ సేన్ ఒక వైపున బయట బ్యానర్‌లో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో .. తన దర్శకత్వంలోను సినిమాలు చేస్తున్నాడు. అలా స్వీయ దర్శకత్వంలో ఆన చేసిన సినిమానే ‘దాస్ కా ధమ్కీ’. ఈ సినిమా నుంచి ‘మావా బ్రో’ లిరికల్ వీడియో ఇటీవల విడుదలైంది. అయితే తాజాగా హీరోగా ‘ఓరి దేవుడా’ తరువాత ఆయన చేసిన సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.
‘ఓ డాలర్ పిలగా .. జిల్ జిలగా .. నీ జంగలు జింకనురా’ అంటూ ఈ పాట సాగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, మంగ్లీ – దీపక్ బ్లూ ఆలపించారు. ఈ సినిమాలో ఇది ఐటమ్ సాంగ్. మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే బీట్ తోనే ఈ పాట నడుస్తుంది. విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పృథ్వీ .. అజయ్ .. రోహిణి .. అక్షర గౌడ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.