తెలంగాణ సర్కార్ కు హై కోర్టు సూటి ప్రశ్న..!

-

కరోనా నేపధ్యంలో ఎన్నో పరీక్షలు ఆగిపోయాయి. విద్యార్థులు అయోమయంలో పడ్డారు. పరీక్షలు ఎప్పుడు పెడతారో కూడా అర్ధం కానని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపధ్యంలో పదో తరగతి పరీక్షల అంశం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై హైకోర్టు కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించగా, ఆ రెండు జిల్లాల్లోనూ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎవరైనా విద్యార్థి కరోనాతో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని పదో తరగతి విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని, సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ కింద గుర్తించాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news