జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నా..!

-

అనంతరపురంలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని, కచ్చితంగా నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని లారీ ఓనర్లను పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news