ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల కంటే ఎక్కువగా న్యాయస్థానాలలో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా గొప్పగా మీడియా ముందు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పినా గానీ అమలు విషయంలో వచ్చేసరికి చాలా వరకు నీరుగారిపోయాయి జగన్ నిర్ణయాలు. తాజాగా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలని జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల హైకోర్ట్ ఏపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ విషయంలో జగన్ సర్కారు ఇచ్చిన 81, 85 జీవోలను కొట్టిపారేసింది.
నిర్ణయాలు తీసుకునే సమయంలో అమలు చేసే సమయంలో ఇలాంటి విషయాలు కోర్టు దాకా వెళ్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి జగన్ ఆలోచించారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన ఈ తీర్పుపై వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ హైకమాండ్ అవగాహన రాహిత్యం వల్ల న్యాయస్థానంలో నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయని లోలోపల చర్చించుకుంటున్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే ఇలానే ఉంటుంది అంటూ మరికొంతమంది వైసిపి హైకమాండ్ మీద విమర్శలు చేస్తున్నారు. జీవోలు ఇచ్చే విషయంలో అవగాహన లేకపోతే ఇలాగే ఉంటుంది అంటూ మరికొంతమంది జగన్ ప్రభుత్వం పై సెటైర్లు వేస్తున్నారు.