మోడీ భద్రత తెలిస్తే నోరెళ్ళబెడతారు…!

-

ప్రధాని నరేంద్ర మోడిని లక్ష్యంగా చేసుకుని పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీని టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారం నేపధ్యంలో మోడికి భద్రతను కట్టుదిట్టం చేసారు. ర్యాలీ ప్రాంతం మొత్తం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎక్కడా ఏ విధమైన ఘటనలు చోటు చేసుకోకుండా,భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు.

ప్రధాని భద్రత అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చీమ చిటుక్కుమన్నా సరే అధికారులు పసిగట్టేస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే వెంటనే అప్రమత్తమై మోడీకి రక్షణగా నిలుస్తారు. తాజా ర్యాలీలో సాధారణంగా ఉండే భద్రతకు అదనంగా 20 మంది డీసీపీ స్థాయి అధికారులను భద్రతకు నియమించారు. ఈ ర్యాలీలో తొలిసారిగా అధికారులు ఫేస్ రికగ్నైజేషన్ పరిజ్ఞానాన్ని వాడుతున్నారని, ర్యాలీకి వచ్చే ప్రతీ ఒక్కరి చిత్రాన్ని తీసుకుంటామని ఒక ఉన్నతాధికారి మీడియాకు వివరించారు.

చుట్టుపక్కల ఉన్న భవనాలపై సాయుధులు అయిన స్నైపర్స్ ని అత్యాధునిక ఆయుధాలతో సిద్దంగా ఉంచామని, యెన్ఎస్జీ కమాండోలు నిత్యం భద్రతలో ఉంటారని అధికారి చెప్పారు. ర్యాలీ జరిగే మైదానాన్ని 11 రీజియన్లుగా విభజించామని, యాంటీ డ్రోన్ టీముల పహారా కొనసాగుతుందని ఆయన వివరించారు.ర్యాలీకి వచ్చే వారిని రెండు సార్లు తనిఖీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version