షాకింగ్… నా కొడుకుని అఖిల ప్రియ ఇరికించింది

-

మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. దీనిపై అఖిల ప్రియ మావగారు స్పందించారు. హఫీజ్ పేట భూమి వివాదంలో తమకు ఎలాంటి సంబంధం లేదని నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కేసులో కావాలనే పోలీసులు మాపై ఒత్తిడి చేస్తున్నారు అని…భార్గవ్ రామ్, అఖిల ప్రియ కు, మాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. భార్గవ్ రామ్ మా అబ్బాయి అఖిల ప్రియ మా కోడలు వారికి మేము అండగా ఉంటాము అని అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

నేను హైదరాబాదు లో లేను దుబాయ్ నుంచి ఈరోజే వచ్చాను అని ఎం ఎం నాయుడు పేర్కొన్నారు. మా అబ్బాయి భార్గవ్ రాముని సరెండర్ చేయాలని చెబుతున్నారు… మా అబ్బాయి ఎక్కడున్నాడో మాకు తెలియదు అని అన్నారు. మా అబ్బాయి కోడలు ఇద్దరు వేరే గా ఉంటున్నారు అని, మా అబ్బాయి చదువులో తెలివైన వ్యక్తి ఇలాంటి కేసులో కావాలని అఖిల ప్రియ భార్గవ్ రామ్ ఇరికించారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఇది కేవలం కుట్రే అని, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కవితలు చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేసారు. ఈ కేసులో చాలా మంది పెద్దల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది అన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమే సమస్యలు పరిష్కరించాలి అని ఆయన కోరారు. భూమా కుటుంబానికి అండగా ఉండాలి వారు తల్లిదండ్రులు లేని పిల్లలని కేసులలో ఇరికించవద్దని విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news