కౌంటింగ్ వద్ద పోలీసుల అత్యుత్సాహం.. బండి ‘కీ’ కి కూడా అనుమతి లేదట !

-

మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది. అయితే ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహం సిబ్బందికి తలనొప్పిగా మారింది. కౌంటింగ్ సిబ్బంది మొబైల్.. బ్యాగ్… అన్నీ బయటే పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కనీసం బ్యాగ్ లు బయట పెట్టడానికి ఏర్పాట్లు లేవని ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే అది మాకు సంబంధం లేదు అని మీ అధికారుల ను అడగండి అంటూ పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. ఇక ఏజెంట్ల.. బైక్ కీ లకు కూడా హాల్ లోకి అనుమతి లేదు అని పోలీసులు చెప్పేస్తున్నారు. కనీసం వాటర్ బాటిల్స్.. సాని టైజర్స్ కూడా అనుమతి లేదు అని అంటున్నారు. ఇంకా పది నిముషాలే కౌంటింగ్ మొదలు కావడానికి ఉండడంతో  కౌంటింగ్ కేంద్రంలోకి… అభ్యర్థులు..ఏజెంట్ లను పంపిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news