పెన్నుతో గీకినా ఓటేసినట్టే అంటూ నిన్న పొద్దుపోయాక ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ జారీ చేసింది. బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు వేసిన ఆ ఓటును పరిగణించాలని ఈ సర్కులర్ జారీ చేశారు. దీంతో ఈ అంశం మీద హై కోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేసింది బీజేపీ. మరి కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. ఇక కాసేపట్లో జీహెచ్ ఎంసీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మధ్యాహ్ననికే GHMC ఫలితం తేలిపోనుంది. 150 డివిజన్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక బల్దియా బరిలో 1,122 మంది అభ్యర్థులు ఉన్నారు. మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్ దేవ్ పల్లి ఫలితం వెలువడనుంది. ఒక రౌండ్‌కి 14 వేల ఓట్లు లెక్కింపు ఉండనుంది. మొదటి రౌండ్‌లోనే మెహిదీపట్నం ఫలితం విడుదల కానుండగా రెండో రౌండ్‌కు 136 డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి.