ఢిల్లీ యూపీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజీపూర్ వద్ద పోలీసులు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. 24వ జాతీయ రహదారి ఖాళీ చేయాలని రైతులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు అయితే రైతు సంఘాలు మాత్రం ఆందోళనను విరమించి ప్రసక్తేలేదని చెబుతున్నాయి. ఇక ట్రాక్టర్ ర్యాలీ లో హింసాత్మక ఘటనలపై ఈరోజు కొంతమంది నేతలకు పోలీసులు సమన్లు జారీ చేశారు. వారందర్నీ ఈరోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు రైతు సంఘాలు ఆందోళన నుంచి వెనక్కి తగ్గగా మిగతా సంఘాలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా రైతు సంఘాలు ఆందోళన పై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఢిల్లీ బోర్డర్ లో నిన్న అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది రైతులను ఖాళీ చేయించేందుకు పోలీసులు వ్యక్తం చేయగా ఆ ప్రయత్నాలేవీ ఫలించ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు పోలీసులను ఎదుర్కొని నిలబడడంతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. హాజీపూర్ వద్ద ఉన్న రైతుల శిబిరానికి కరెంటు, మంచి నీళ్లు బంద్ చేశారు అయినా సరే రైతులు ఎదురు నిలబడి అక్కడే బైఠాయించారు దీంతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు.