బ్రహ్మంగారి మఠంలో టెన్షన్ వాతావరణం..విశ్వ బ్రాహ్మణులు, గ్రామస్తులు మధ్య ఘర్షణ

-

కడప జిల్లా : బ్రహ్మంగారి మఠంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. విశ్వ బ్రాహ్మణులు, గ్రామస్తులు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అంతేకాదు బ్రహ్మంగారి మఠంలో విశ్వ బ్రాహ్మణుల మీడియా సమావేశాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో వివాదాలు సృష్టించేలా విశ్వ బ్రాహ్మణులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివస్వామిపై ఆరోపణలు చేస్తే తాము సహించేది లేదంటూ విశ్వబ్రాహ్మానులను అడ్డుకున్నారు బ్రహ్మంగారి మఠం గ్రామస్థులు. పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యాక ఎందుకు మళ్ళీ వివాదం సృష్టిస్తున్నారని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ ఆచారిని గ్రామస్థులు నిలదీశారు. అయితే దీనిపై విశ్వ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ స్పందించారు.

గత కొన్ని రోజులుగా మఠంలో జరుగుతున్న పరిణమాలపై రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఆందోళన చెందుతున్నారని…బ్రహ్మంగారి మఠంలో ఎలాంటి అలజడులు సృష్టించడానికి మేము రాలేదని పేర్కొన్నారు. విశ్వ బ్రాహ్మణులు అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పడం కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నామని… ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాలజ్ఞాని వీర బ్రహ్మం కాదని మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version