మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంతూరు అయిన కమలాపూర్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా ప్రజా ప్రతినిధులను మంత్రి ఎర్రబెల్లి అవమానించారంటూ ధర్నా చేపట్టారు బిజెపి మహిళ నాయకులు. నిన్న కమలాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపిపి రాణికి మాట్లాడే అవకాశము ఇవ్వకుండా మంత్రి ఎర్రబెల్లి అవమానించారని నిన్నటి నుండి నిరసనలు కొనసాగుతున్నాయి.
కమలపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఈటెల సతీమణి జమున తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి ఎర్రబెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ధర్నాలోనే సృహ కోల్పోయి పడిపోయింది ఈటెల జమున. అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమచారం. ఇక అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ను దహనం చేసేందుకు బిజెపి నాయకులు యత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ధర్నా కార్యక్రమం వద్దకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మరియు బిజెపి శ్రేణులకు మధ్య వాగ్వాదం నెలకొంది.