ఆ మూడు రాష్ట్రాల్లో ఎక్కడ గెలిచినా.. బైడెనే ప్రెసిడెంట్ !

-

అమెరికానే కాక యావత్ ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తున్న పరిణామం అమెరికా అధ్యక్ష ఎన్నిక. డోనాల్డ్ ట్రంప్ – జో బిడెన్ లు పోటాపోటీగా తలపడిన ఈ ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చేయగా మరో ఐదు రాష్ట్రాల్లో ఇంకా ఫలితాలు స్పష్టం కావలసి ఉంది. అయిదు రాష్ట్రాల్లో నెవాడా, ఆరిజోనా రాష్ట్రాల్లో బిడెన్ దే పైచేయిగా కనిపిస్తోంది. మొత్తం మీద నాలుగు స్వింగ్ రాష్ట్రాల్లో బిడెన్ హవా కనిపిస్తోంది. పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడా రాష్ట్రాల్లోని ఒక్క ఓటు ఒక్కో రకమైన టెన్షన్ పెడుతోంది.

ఇప్పటికీ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బిడెన్ గెలుపునకు మరో ఆరు స్థానాల దూరంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడా రాష్ట్రాల్లో ఏ ఒక్క స్థానంలో గెలిచినా బిడెన్ అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా అవుతారు. మరోపక్క నార్త్ కరోలినా విషయానికి వస్తే అక్కడ ట్రంప్ ఆధిక్యత కనిపిస్తోంది. అలానే జార్జియాలో కూడా ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉండడంతో అక్కడ రీకౌంటింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. జార్జియా చట్టాల ప్రకారం ఇద్దరి ఓటింగ్ శాతంలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటే అభ్యర్థుల కోరిక మేరకు మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ రీ కౌంటింగ్ కోరినా సరే మరో 10 రోజులు దాకా రీకౌంటింగ్ చేసే అవకాశం అయితే లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news