ఆధార్ సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, తదితర అంశాలు తొలగిస్తూ మాన్యువల్ సవరించే వారకూ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్కింగ్ ఆపాలని హైకోర్టు ప్రభుతావనికి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరీ ఆధార్ వివరాలు సేకరించరాదని బల్లగుద్ది చెప్పింది. ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్కింగ్ మాన్యువల్‌ను మార్చాల్సిందే అంది. పీటీఐఎన్‌కు దాఖలు చేసేటప్పుడు కూడా ఈ వివరాలు ఉండరాదని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కానీ.. ఆ«ధార్ మినహా ప్రభుత్వం జారీ చేసినా ఏ ఒక్క గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టమైన హామీ ఇచ్చింది.
ఇష్టం ఉన్నా.. ఎలా సేరిస్తారు..?
ధరణి నమోదులో ఆధార్, కులం తదితర వివరాలు అడగటాన్ని సవాల్ చేస్తూ కే. సాకేత్, ఐ గోపాల్ శర్మ మరికొందరు న్యాయవాదులు వేసిన పిటీషన్‌పై న్యామూర్తులు జస్టీస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టీస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన «ధర్మాసనం విచారణ చేపట్టింది. గోపాల్ శర్మ తరఫున న్యాయవాది ప్రకాష్ రెడ్డి, స్లాట్‌బుక్కింగ్‌లో, పీటీఐఎన్ నమోదులో ఆధార్ వివరాలు అడుగుతున్నారని వాదించగా.. ఆధార్ కోసం ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆధార్ ఇవ్వని వారికి ప్రత్యామ్నాయ మార్గం ప్రవేశ పెట్టామని అడ్వొకేట్ జనరల్ బీఎస్. ప్రసాద్ తన వాదనాలు విన్పించారు.
21న విచారణ..
వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు అడుగుతున్నారని మరో పిటిషనర్ తరఫు నుంచి న్యాయవాది కృతి ధర్మాసనం ముందు ఉంచగా.. స్పందించిన ధర్మాసనం అస్సలు ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారో..? ఈ కేసంతా గాలిలో దీపంలా వేలాడుతుందని వ్యాఖ్యనించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలుపగా.. విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది.