తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ మద్దతుదారుల సూసైడ్ అటెంప్ట్ !

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ రెండో విడత ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి మద్దతుదారుడు సర్పంచ్ గా గెలిచాడని అధికారులు ప్రకటించడంతో రీ కౌంటింగ్ చేపట్టాలని టిడిపి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో పెట్రోల్ పోసుకుని టిడిపి మద్దతుదారులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారు.

tdp
tdp

దీంతో ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ వెంకటేశ్వర రావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా ఫలితాల విషయానికి వస్తే ఒక్కో మీడియా ఛానల్స్ ఒక్కో రకమైన అంకెలను ప్రదర్శిస్తోంది. అధికార వైసీపీ ఎప్పటిలానే మెజారిటీ స్థానాలు గెలుచుకోగా టిడిపి రెండో విడత లోను గట్టి పోటీ ఇచ్చింది అని చెబుతున్నారు. అలాగే బిజెపి జనసేన లు సైతం సత్తా చాటడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించి కొంతమేర సఫలం అయ్యాయి అని చెబుతున్నారు.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...