ఆకట్టుకుంటున్న రాధే శ్యాం గ్లింప్స్ .. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారుగా !

Join Our Community
follow manalokam on social media

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. సుమారు 40 సెకండ్స్ దాకా ఉన్న ఈ వీడియోలో ఒక ఫారెన్ రైల్వే స్టేషన్  చూపించారు. అందులో జనాల మధ్య లో నడుచుకుంటూ వెళుతున్న పూజా హెగ్డేని వెనుక నుంచి చూసిన ప్రభాస్ ఇటాలియన్ భాషలో ఏదో చెబుతాడు. దానికి పూజ మినహా చుట్టూ ఉన్న ఆడవాళ్లు అందరూ ప్రభాస్ వంక చూసి నవ్వుకుంటూ వెడతారు.

అనంతరం పూజ ప్రభాస్ తో నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది, దానికి ప్రభాస్ ప్రేమ కోసం రోమియో చచ్చాడు కానీ నేను అలాంటి వాడిని కాదు అంటూ ముసిముసిగా నవ్వుతూ చెబుతాడు. దీంతో అక్కడికి వీడియో ఎండ్ అవుతుంది. మొత్తానికి ఈ చిన్న వీడియో గ్లింప్స్ సినిమా మీద ఆసక్తి పెంచేసిందని చెప్పాలి. ఇక అలాగే ఈ సినిమాని జూలై 30వ తారీఖున రిలీజ్ చేస్తున్నామని కూడా వీడియో చివర్లోనే ప్రకటించారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ప్రసీద సమర్పిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....