హైదరాబాద్ హాస్పిటల్ లో టాగూర్ సినిమా సీన్ రిపీట్

-

హైదరాబాద్ ఉప్పల్ లోని టిఎక్స్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం హాస్పిటల్ వచ్చిన వారికి ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. మనిషిని బ్రతికిస్తామని ప్యాకేజ్ సెట్ చేసుకొని, ప్యాకేజీ అయిపోయిందని డబ్బులు డిమాండ్ చేశారు. అలా జరిగి ప్రాణాలు పోయాక కుడా డబ్బుల డిమాండ్ చేసి డెడ్ బాడీలను టిఎక్స్ హాస్పిటల్  యాజమాన్యం ఇవ్వట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బౌన్సర్లతో బాధితులను బెదిరిస్తున్నారని బాధితులు ఆరిపిస్తున్నారు.

హాస్పిటల్ లో చికిత్స బాగో లేదని, మొత్తం మోసమే అని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని హాస్పిటల్ ముందు బైటాయించారు. వేరువేరు చికిత్సలకోసం వచ్చిన మూడు కుటుంబాల బాధితులకు అదే పరిస్థితి అని బాధితులు వెల్లడించారు. నిన్న ముగ్గురు చనిపోగా ఆ ముగ్గురి బాడీలను ఇవ్వడానికి హాస్పిటల్ యాజమాన్యం డబ్బులు డిమాండ్ చేసినట్టు సంచారం.  ఒకరిని సెటిల్ మెంట్ తో పంపించిన యాజమాన్యం. మరో రెండు డెడ్ బాడీలకు చెందిన బాధితులు హాస్పిటల్ ముందు బైటాయించారు. అచ్చం టాగూర్ సినిమాలో సీన్ రిపీట్ అయినట్టు ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news