పాతబస్తీలో ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్ ?

-

హైదరాబాద్ పాత బస్తీ  ఉప్పు గూడ కాళికా మాతా దేవాలయానికి సంబంధించి 24,25,26 సర్వే నెంబర్లల్లోని 70 కోట్ల విలువ గల 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని ఓ వ్యక్తి అదో తన స్థలమేనిన్ సిటిసివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్దర్లు తీసుకోవడంతో పాటుగా ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో స్థానికులు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో మహిళలను, వృద్ధులు, బీజేపీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లో తరలిస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది.

ఈ క్రమంలో అక్కడికి బండి సంజయ్ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇక 1951 లో ఈ స్థలాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి  తీసుకొని ఇప్పటి వరకు 11 సార్లు వేలం పాట చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఒక సారి వేలం పాట కూడా నిర్వహించగా ఆ వేలం పాటలో ధర తక్కువగా వచ్చిందని సీపీఐ నాయకులు హై కోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటి నుంచి రాని ఓ వ్యక్తి ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూములలో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news