రైతుల ఆందోళన మీద సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

-

ఆందోళన చేస్తోన్న రైతులను తరలించాలన్న పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు అనుమతిచ్చింది. కేంద్రం, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.  రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తామన్నారు చీఫ్ జస్టిస్‌. త్వరలోనే రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని చెప్పింది కోర్టు.

farmers
farmers

ఇక కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరింది. చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కితగ్గేది లేదని ఘంటాపథంగా చెబుతున్న అన్నదాతలు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.  ఇవాళ దిల్లీ-నోయిడా మధ్య చిల్లా సరిహద్దును పూర్తిగా బ్లాక్‌ చేశారు. తమ నిరసనలను కించపరచొద్దని, అన్ని రైతు సంఘాలకు సమాన ప్రాధాన్యమిచ్చి చర్చలు జరపాలని రైతు ప్రతినిధులు ఇవాళ కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వం చర్చల్లో చెప్పిందే మళ్లీ రాతపూర్వక ప్రతిపాదనల్లో పేర్కొందని.. అందుకే తాము తిరస్కరించినట్లు వెల్లడించారు. కొత్త చట్టాలను ప్రభుత్వం.. రద్దు చేసేలా చేస్తామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news