ఇప్పటివరకూ ఏం చేశారు..?.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం

-

అమరావతి: ఏపీ‌లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఇందుకు సవివరంగా ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

 

ఇక బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత, అత్యధిక ధరలకు అమ్మకాలపై కూడా ప్రభుత్వానికి కోర్టు ప్రశ్నలు సంధించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సరిపడా ఇంజక్‌న్లు సరఫరా చేయటంలేదని రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది. ఇప్పటి వరకు 13 వేల ఇంజక్షన్లు ఇచ్చారని, 14 వందల మంది పేషేంట్స్ ఉన్నారని, ఒక్కో బ్లాక్ ఫంగస్ పేషేంట్‌కి రోజుకి 3 ఇంజక్షన్లను 15 రోజులు ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ ఫంగస్ పేషేంట్స్ కోసం 50 వేల ఇంజక్షన్ల అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. ఏపీకి అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో, ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారో కేంద్రం మధ్యాహ్నం నాటికి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news