ఏపీ రాజకీయాల్లోకి కేంద్రబిందువుగా రామతీర్థం మారిపోయింది. నిన్న చంద్రబాబు, విజయసాయిలు అక్కడ పోటాపోటీగా పర్యటనలకు వెళ్ళడంతో అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక నిన్న మొదలయిన హై టెన్షన్ వాతావరణం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇంకా కొనసాగుతోంది ఈరోజు హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థం పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు వివిధ ప్రాంతాల హైందవ సంఘాల నేతలు రామతీర్థం చేరుకోనున్నారు.
అయితే ఈ రోజు పది గంటల సమయంలో రామ తీర్థానికి మంత్రులు బొత్స వెల్లంపల్లి కూడా చేరుకునే క్రమంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. సంఘటనా స్థలాన్ని మంత్రి బొత్స అలాగే వెల్లంపల్లి ఇద్దరూ సందర్శించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అక్కడ వేసిన దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. అలానే మంత్రుల పర్యటన నేపథ్యంలో రామతీర్థంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటన నేపధ్యంలో దీక్ష చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ లోనే దీక్షలు చేస్తున్నారు బీజేపీ నేతలు.