బెజవాడలో సీతమ్మ విగ్రహం ద్వంశం, ఎలుకలు పాడు చేశాయని చెప్పిన సిఐ

-

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడులు ఈ మధ్య కాలంలో సంచలనం అవుతున్నాయి. దేవాలయాల మీద దాడులు జరగడంపై విపక్షాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. అయినా సరే ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో విగ్రహం ధ్వంసం అయింది.

బస్టాండ్ లోని నర్సరీ వద్ద ఉన్న పురాతన సీతారామ మందిరంలో విగ్రహం ద్వంసం అయింది. సీతాదేవి విగ్రహాన్ని దుండగులు ద్వంశం చేసారు. ఘటనా స్థలికి చేరుకుని ఘటన ఎలా జరిగింది ఏంటీ అనే దాన్ని పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆలయం వద్దకు భారీగా ఆర్టీసీ ఉద్యోగులు, తెదేపా కార్యకర్తలు చేరుకున్నారు. బస్టాండ్ సమీపంలోని సీతారామ మందిరం వద్దకు చేరుకున్న తెదేపా నేత పట్టాభిరాం పోలీసుల తీరుపై మండిపడ్డారు.

సీతాదేవి విగ్రహం ధ్వంసం ఘటన పై విచారణ జరపాలని పోలీసులను పట్టాభిరాం కోరారు. ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందని సీఐ సత్యానందం చెప్పడం గమనార్హం. సీఐ సమాధానంపై తీవ్ర అభ్యంతరం చెప్పిన తెదేపా నేత పట్టాభిరాం… సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే ఏపీలో రామ తీర్ధం ఘటన సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news