హిమాచల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలూ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మజాన్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా జరిగిన ఘటనలో ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమదాంలో మజాన్ గ్రామంలో దాదాపు 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో 26 పశువుల పాకలు కూడా కాలి బూడిదయ్యాయి. దాదాపు 9 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచానా వేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇళ్లల్లో ఆకస్మాత్తుగా మంటలు చెరగేడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. ఇళ్లలో హఠాత్తుగా మంటలు చెలరేగినట్లు ప్రజలు చెబుతున్నారు. ఇళ్లు కాలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. అయితే ప్రాణ నష్టం ఇప్పటివరకు సంబంవించలేదు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో బాధితులకు ప్రభుత్వం తరుపున అన్నివిధాల సాయం చస్తామని హామీ ఇచ్చారు.