ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళా ఖాతము నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర:
ఈరోజు మరియు రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్లకురిసే అవకాశముంది .
ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
రాయలసీమ
ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి రాయలసీమ లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.