కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ డీఎన్ఏ చైనాదా…? అస్సాందా..? అంటూ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని మాత్రమే అవమానించలేదని.. ఓ తల్లిని అవమానించాడని ఆయన విమర్శించారు. తల్లులను అవమానించే సంస్కృతి భారత దేశంలో లేదని.. ఇది విష సంస్కృతి అని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా.. లేకపోతే ఈ వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకుంటారా.. అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.. అయితే దాన్ని రాజకీయానికి వాడుకోలేదని ఆయన అన్నారు. సిగ్గు లేని బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆధారాలు అడిగితే తప్పు ఎలా అవుతుందని.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అన్నారు. మేము ఇలాగే మాట్లాడితే మర్యాదగా ఉంటుందా.. అని అన్నారు. అమర్యాదకరంగా మాట్లాడారని.. హిమంత్ బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై చర్చ చేయడమే అవమానకరం అని రేవంత్ రెడ్డి అన్నారు.